ఆరోజే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి జాబితా విడుదల

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Indlu Scheme) ఆశావహులకు గుడ్ న్యూస్. ఈ ఇళ్ల పంపిణీలో భాగంగా 18వ తేదీన అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. 21వ తేదీ నుంచి గ్రామసభల్లో ఈ జాబితాను విడుదల చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. 26వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది.  మొదటి విడతలో సొంత స్థలం ఉండి నిరుపేదలైన వారికే ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

నియోజకవర్గానికి 3500 ఇండ్లు

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాలు, పట్టణాల వారీగా మంజూరు చేసిన వాటి వివరాలను జిల్లా ఇం​ఛార్జి మంత్రికి సమర్పిస్తే ఆయన ఆమోదించి ఎన్ని మంజూరయ్యాయో గ్రామసభల్లో ప్రదర్శిస్తారు. నిరుపేదలు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ఈ ఎంపికలో ప్రాధాన్యమిస్తారు.

100 శాతం సర్వే పూర్తి

గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలో గురువారం వరకు ఇందిరమ్మ ఇళ్ల యాప్​ సర్వే 97 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 32 జిల్లాల్లో 69,83,895 దరఖాస్తులు ఉండగా 68,08,923 దరఖాస్తులను సర్వే చేసినట్లు వెల్లడించారు. సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో 100శాతం, భద్రాద్రి కొత్తగూడె, నల్గొండ, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో 99 శాతం సర్వే పూర్తయిందని వివరించారు. మహబూబ్​నగర్​, మహబూబాబాద్​, పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల, నాగర్​కర్నూల్​, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 98శాతం సర్వే చేసినట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ 100శాతం పూర్తి చేసి ఈ నెల 18న అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *