
భారత ఐటీ(IT) రంగాన్ని కలవరపరుస్తూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం ఉద్యోగులకె కాదు, విద్యార్థుల మధ్య తీవ్ర ఆందోళనకు దారి తీసింది. అయితే ఇదే సమయంలో భారత్‌లోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్(Infosys ) మాత్రం హాయిగా ఊపిరి పీల్చుకునే వార్తను ప్రకటించింది.
ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్(Infosys CEO Salil Parekh) ప్రకారం, కంపెనీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్ల(Freshers)ను నియమించాలనే(recruitment) లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో 17,000 మందిని తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది పాటు కళాశాలల నుంచి విద్యార్థులను రిక్రూట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ టెక్నాలజీలలో పెట్టుబడులతో పాటు ఉద్యోగుల రీస్కిల్లింగ్ పై కంపెనీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటివరకు 2.75 లక్షల మందికి పైగా ఉద్యోగులకు వివిధ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చినట్లు పరేఖ్ వెల్లడించారు.
ఇన్ఫోసిస్ దృష్టి కొత్త ప్రాజెక్టులపై ఉండటంతో, సాంకేతిక నైపుణ్యాలున్న ఉద్యోగులకు అవకాశాలు మరింత పెరుగుతాయని ఆయన అన్నారు. దిగువ స్థాయి ఉద్యోగుల సంఖ్యను కూడా 0% నుంచి 1%కి పెంచినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ప్రకటన యువతకు ఆశాభావాన్ని కలిగించిందని చెప్పవచ్చు.