IPL 2025 Mega Auction: ఐపీఎల్ వేలంలో టీమిండియా వికెట్కీపర్రిషభ్పంత్కు (Rishabh Pant) రికార్డు ధర లభించింది. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ.27 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా పంత్ నిలిచాడు. అతడి కోసం లఖ్‌నవూ, బెంగళూరు జట్లు తీవ్రంగా పోటీ పడగా.. చివరకు లఖ్‌నవూ రికార్డు ధరకు దక్కించుకుంది.
శ్రేయస్ అయ్యర్‌కు రూ.26.75 కోట్లు
ఇక ఇదే ఆక్షన్‌లో శ్రేయస్ అయ్యర్ ను (shreyas iyer) పంజాబ్కింగ్స్రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. కనీస ధర రూ.2 కోట్లు అతడి కోసం మొదట కోల్‌కతా, ఢిల్లీ ఫ్రాంచైజీలు పోటీ పడగా.. ఆ తర్వాత రేసులోకి వచ్చిన పంజాబ్‌కింగ్స్ రూ.26.75 కోట్లు పెట్టి ఎగరేసుకుపోయింది.
రాహుల్‌కు 14 కోట్లు, చాహల్‌కు 18 కోట్లు
ఇక మరో కీపర్కేఎల్రాహుల్ను (KL Rahul) ఢిల్లీ జట్టు రూ.14 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. రిషబ్ పంత్‌ను వదిలేసిన ఢిల్లీ.. కెప్టెన్సీ చేసే సత్తా ఉన్న ప్లేయర్ కోసం వెతికి కేఎల్రాహుల్కు దక్కించుకుంది. యుజ్వేంద్ర చాహల్ ను (Yuzvendra Chahal) పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.పంత్, అయ్యర్, చాహల్‌కు పెట్టిన ధర చూస్తే రాహుల్‌కు తక్కువ ధర పలికారని చర్చ నడుస్తోంది.








