ఐపీఎల్ మెగా వేలానికి (IPL Auction 2025) సర్వం సిద్ధమైంది. ఆయా ఫ్రాంచైజీలు వదిలేసుకున్న, ఆయా ఫ్రాంచైజీలను వదిలేసుకున్న భారత స్టార్లపై మిగతా జట్లు భారీ ధర పెట్టి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యం ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant)
, లక్నో సూపర్ జైంట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై (KL Rahul) యాజమాన్యాలు కన్నేశాయి. బ్యాటింగ్ మాత్రమే కాకుండా వికెట్ కీపింగ్, కెప్టెన్సీ చేసే సామర్థ్యం ఉన్న వీరిపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించే అవకాశం ఉంది. వీరితోపాటు వేలంలో ఉన్న ఇరత భారత స్టార్లు, విదేశీ సూపర్స్టార్లపై ఓ లుక్కేద్దాం.
గత సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు కప్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (shreyas iyer) సైతం ఈసారి వేలంలో ఉన్నాడు. అతడికి కొనేందుకు కూడా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. హైదరాబాదీ సిరాజ్ (mohammed siraj) తోపాటు మరో సీమర్లు అర్షదీప్ సింగ్, సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, యువ ఆటగాళ్లు, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, మహిపాల్ లామ్రోర్, అన్మోల్ సింగ్, మయాంక్ మార్కండే, విజయ్‌కుమార్ వైష్యక్, కార్తీక్ త్యాగి, యశ్ థాకూర్, యశ్ ధుల్, వైభవ్ అరోరాతోపాటు మరికొందరు యువ ఆటగాళ్లపైనా ఫ్రాంచైజీలు కన్నేశాయి.
ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc), ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లివింగ్టన్, అఫానిస్థాన్ యువ కెరటం ఫజల్హక్ ఫరూఖీ, వెస్టిండీస్ మాజీ ఓపెనర్ కైల్ మేయర్స్, వెస్టిండీస్ సీమర్ అల్జారీ జోసెఫ్, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, ఆస్ట్రేలియా బౌలర్ బెహరన్డార్ఫ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డేనియల్స్ సామ్స్, శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగ, అమెరికా ఆటగాడు సౌరభ్ నట్రవాల్కర్, జోఫ్రా ఆర్చర్తోపాటు మరికొందరిని కూడా ఫ్రాంచైజీలు దక్కించుకునే అవకాశం ఉంది.








