IPL 2025: ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. వారి ప్లేస్‌లో కొత్త ప్లేయర్లకు ఛాన్స్

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ (IPL-2025) సీజన్‌ను BCCI ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ పంజాబ్‌లోని ధర్మశాలలో PBKS VS DC మధ్య జరిగింది. అదే సమయంలో పంజాబ్‌లో యుద్ధ సైరన్(War Siren) మోగడంతో మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. అనంతరం BCCI కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు వాయిదా(Postpone) వేస్తున్నట్లు తెలిపింది. అయితే భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ(Ceasefire) అనంతరం మళ్లీ ఐపీఎల్ రీస్టార్ట్ తేదీల(IPL New Schedule)ను బీసీసీఐ అనౌన్స్ చేసింది.

IPL 2025 Playoff Scenarios Explained: Qualification Chances for All Teams

6 ప్రాంతాల్లో మిగతా 17 మ్యాచ్‌లు

ఈ మేరకు ఈనెల 17 నుంచి మిగిలిన మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 6 ప్రాంతాల్లో మిగతా 17 మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే భారత్‌, పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఉండటంతో విదేశీ ఆటగాళ్లు(Foreign Players) తమ దేశానికి వెళ్లిపోయారు. ఇప్పుడు మ్యాచ్‌‌లు రీస్టార్ట్ అవుతున్నా వారు తిరిగి ఇండియా(India)కు రావడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరు అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం వెళ్లిపోగా.. మరికొందరు గాయాలు, వ్యక్తిగత కారణాలతో తర్వాతి మ్యాచ్‌లకు దూరం కానున్నారు.

ఫ్రాంచైజీలు ఇబ్బంది పడకుండా..

ఈ తరుణంలోనే ఫ్రాంచైజీలు ఇబ్బంది పడకుండా IPL కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే వారి ప్లేస్‌లో కొత్త వారిని టీమ్‌లోకి తీసుకోవచ్చని తెలిపింది. అయితే దానికీ కొన్ని కండీషన్లు(Conditions) పెట్టింది. ప్లేయర్ల రీ-ప్లేస్‌మెంట్‌(Re-placement)లు తాత్కాలికమేనని చెప్పింది. ఇప్పుడు రీప్లేస్ చేసే వారిని వచ్చే సీజన్‌కు రిటైన్‌ చేసుకోవడం కుదరదని క్లారిటీ ఇచ్చింది. టెంపరరీగా వివిధ టీమ్‌లలో చేరే ప్లేయర్లు వచ్చే ఏడాది అంటే 2026 IPL మినీ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు BCCI ఫ్రాంఛైజీలకు తెలిపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *