IPL 2025: క్వాలిఫయర్-1.. ఒకవేళ వర్షం పడితే ఏమవుతుందంటే?

IPL 2025లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక ప్లే ఆఫ్స్(PlayOffs) మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫైనల్‌(Final)తో సహా మొత్తం 4 మ్యాచ్‌లతో ఈ సీజన్ ముగియనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ క్వాలిఫయర్-1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(PBKS) తలబడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టు ఆదివారం (జూన్ 1) క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంది. 2016 తర్వాత ఆర్సీబీ ఫైనల్‌కు చేరలేదు. మరోవైపు 2014 తర్వాత పంజాబ్ ఫైనల్‌కు వెళ్లలేదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ రెండు జట్లకు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ కొట్టలేదు.

 

సూపర్ ఫామ్‌లో ఉన్న రెండు జట్లు

 

కాగా ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ రెండు జట్లు ఈ సారి ట్రోఫీ గెలవడానికి ఇదొక చక్కని అవకాశం. ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ చండీగఢ్‌లో జరగనుండడంతో పంజాబ్ జట్టుకు కలిసి రానుంది. మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ సమరంలో పంజాబ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. టోర్నీలో 14 మ్యాచ్ ల్లో 19 పాయింట్లతో పంజాబ్ టేబుల్ టాపర్‌గా గ్రూప్ స్టేజ్ ముగించింది.

 

పంజాబ్‌కే ప్లస్ అవుతుంది..

 

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో 19 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే లీగ్ దశలు టాప్‌లో ఉన్న పంజాబ్ ఫైనల్‌కు చేరుతుంది. గ్రూప్ స్టేజ్ లో పంజాబ్, ఆర్సీబీ సమాన పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ పంజాబ్ కు ఎక్కువగా ఉంది. పంజాబ్ నెట్ రన్ రేట్ +0.372 ఉంటే ఆర్సీబీ నెట్ రన్ రేట్ +0.301 ఉంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే క్వాలిఫయర్-1కు రిజర్వ్ డే లేదు. దీంతో పంజాబ్ టేబుల్ టాపర్ కాబట్టి ఫైనల్‌‌కు వెళ్తుంది. కాగా మ్యాచ్ రేపు సాయంత్రం 7:30గంటలకు ప్రారంభమవుతుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *