Prabhas: ప్రభాస్ పెళ్లికి శుభారంభం? తలుపులమ్మకు పూజలు చేసిన ప్రభాస్ పెద్దమ్మ..

ఇండియన్ సినీ ప్రపంచంలో ఓ ప్రశ్న ఎప్పటికీ చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్( Prabhas) పెళ్లి ఎప్పుడు? తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. ‘ఈశ్వర్’ సినిమాతో కథానాయకుడిగా ప్రవేశించిన ప్రభాస్, ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోయినా, ‘సలార్’, ‘కల్కి 2898ఏడీ’ వంటి చిత్రాలతో మళ్లీ తానెంత పెద్ద స్టారో నిరూపించుకున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే సినీ విజయాల సంగతి పక్కన పెడితే, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. 45 ఏళ్లు దాటినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

గతంలో త్రిష, అనంతరం అనుష్కతో ప్రేమ, పెళ్లి పుకార్లు ఊపందుకున్నా… అవన్నీ అపవాదులేనని ఆయన ఎన్నిసార్లు స్పష్టం చేశారు. అయినా పెళ్లి పుకార్లు మాత్రం తగ్గలేదు. ఇటీవల ప్రభాస్ పెళ్లి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తెతో ఫిక్స్ అయ్యిందని, ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ఏర్పాట్లు చూస్తున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ప్రభాస్ టీమ్ అవన్నీ వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చింది.

తాజాగా శ్యామలాదేవి(Syamala Devi) తలుపులమ్మ లోవ( Talupulamma lova) ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని, ఇవి ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆకాంక్షతో చేశారన్న ప్రచారం జరుగుతోంది. కానీ కొందరు మాత్రం ఇది ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసమేనని అంటున్నారు. మొత్తానికి, ప్రభాస్ పెళ్లిపై ఇంకా క్లారిటీ రాకపోయినా… అభిమానులు మాత్రం ఎదురు చూపులే తీరాలని కోరుకుంటున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *