వైమానికి దాడులతో మరోసారి గాజా(Gaza) దద్ధరిల్లింది. శనివారం ఇజ్రాయెల్(Israel) జరిపిన ఈ దాడుల్లో 40 మందికిపైగా మృతి చెందారు. ఇందులో 23 మంది పాలస్తీనియన్లు ఉన్నారు. గాజా(Gaza City) సిటీలో 17 మంది, జబాలియాలో ఒకరు, ఖాన్ యూనిస్‌లో ముగ్గురు వరల్డ్ సెంట్రల్ కిచెన్(World Central Kitchen) సహాయక సిబ్బందితో సహా 5గురు మృతి చెందారని మీడియా వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాల సమయంలో దాడులు జరగడం గమన్హారం. మరోవైపు తాజా దాడులతో గాజాలోని పాలస్తీనియన్ల ఆకలి కేకలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని మీడియా వర్గాలు తెలిపాయి. కాగా, తూర్పు గాజా సిటీలో షుజయూ పరిసరాల్లో(neighborhood of Shujayu)ని ఒక ఇంటిపై ఇజ్రాయిల్ సైన్యం వైమానిక దాడి(air raids) జరిపింది.
ఆ రెండు ప్రాంతాల్లో భారీ ప్రాణనష్టం
గాజాలో దీర్ఘకాలంగా నెలకొల్పబడిన 8 శరణార్థుల శిబిరాల్లో ఒకటైన నుసైరాత్ ఉత్తర భాగం(Northern part of Nusairat)లో 19 మంది పాలస్తీనియన్ల మృతదేహాల(Dead bodies of Palestinians)ను వైద్యాధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో దాడిలో, వైద్య వర్గాల ప్రకారం, ఉత్తర గాజా(North Gaza)లోని బీట్ లాహియాలో ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో కనీసం 10 మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజా స్ట్రిప్‌లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు రెండింటిలోనూ అధిక ప్రాణనష్టం సంభవించిందని అక్కడి వార్తాపత్రికలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయిల్‌పై మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేశామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ డేఫ్(Mohammed Daef) వెల్లడించారు.
తీవ్రస్థాయికి యుద్ధ వాతావరణం
కాగా హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం(Hamas-Israel war)లో ఇప్పటివరకు మహిళలు, పిల్లలతో కలిపి మొత్తం 44,300 మంది చనిపోయినట్లు హమాస్ పరిధిలోని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గాజాలో 178 మంది చనిపోయారని, యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన భయంకర దాడుల్లో ఇది కూడా ఒకటని హమాస్ హెల్త్ మినిస్ట్రీ(Hamas Health Ministry) తెలిపింది. హమాస్ దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంపై దాడి చేసి 1,300 మందిని హతమార్చడంతో పాటు 240 మందిని బందీలుగా తీసుకెళ్లడంతో అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ సైనిక చర్యకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తీవ్రస్థాయికి చేరింది.






