Israel vs Iran: ఇరాన్‌పై మెరుపు దాడులు.. టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్

మిడిల్ఈస్ట్‌(Middle East)లో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈరోజు తెల్లవారుజామున ఇరాన్‌ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడుల(Israeli Airstrikes)కు దిగింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో విరుచుకుపడటంతో ఇరాన్‌ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌(Revolutionary Guard Chief) సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. ఈమేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను ప్రారంభించాం: నెతన్యాహు

కాగా ఈ ఉద్రిక్తతలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(Israeli PM Benjamin Netanyahu) స్పందించారు. ఇరాన్‌ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ‘Operation Rising Lion’ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ దేశ అణు కార్యక్రమానికి హృదయం లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని వెల్లడించారు. మరోవైపు తమ దేశ అణు స్థావరాలపై మిస్సైళ్లతో దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ(Ayatollah Khamenei) హెచ్చరించారు. టెల్ అవీవ్‌(Tel Aviv)పై తప్పక ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

భారత పౌరులకు కీలక హెచ్చరికలు

ఇదిలా ఉండగా ఈ రెండు దేశాల్లో నివసిస్తున్న భారత పౌరుల(Citizens of India)ను ఉద్దేశించి అక్కడి ఇండియన్ ఎంబసీలు (Indian Embassy) అడ్వైజరీలు జారీ చేశాయి. ‘ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్‌ మీడియా(SM)లో తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండి’ అని ప్రకటించాయి.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *