పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్(Hari Hara Veera Mallu: Part 1 – Sword vs. Spirit)’ సినిమా జూలై 24న విడుదలై, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో, కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి వీరమల్లు యుద్ధం చేసే కథ ఆధారంగా తెరకెక్కింది. అయితే ఈ మూవీ VFXపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జ్యోతి కృష్ణ(Director Jyothi Krishna) స్పందించారు. ఈ మూవీ VFX కోసం 25కి పైగా అంతర్జాతీయ టీమ్‌లు, ఇండియా నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలలోని బృందాలు పనిచేశాయని తెలిపారు. వీఎఫ్ఎక్స్ కోసం స్థానిక సంస్థలతో పనిచేయడం వల్ల వేగంగా మూవీ పూర్తి చేయగలిగామని, ఈ టీమ్‌లు రోజుకు 15 గంటలు శ్రమించాయని తెలిపారు.

20 నిమిషాల సన్నివేశాలను తొలగింపు
ఈ చిత్రంలో 4400CG షాట్‌లు ఉన్నాయి. క్లైమాక్స్(Climax) కోసం రూ. 20-25 కోట్లు వెచ్చించారని సమాచారం. అయితే, విడుదలైన తర్వాత వీఎఫ్ఎక్స్ నాణ్యతపై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా(SM)లో ప్రేక్షకులు, ఫ్యాన్స్ సీజీ సన్నివేశాలు నిరాశపరిచాయని, ప్రత్యేకించి రెండో భాగంలోని గుర్రపు స్వారీ, కోహినూర్ హీస్ట్ సన్నివేశాలు ఆకట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ విమర్శల నేపథ్యంలో, మేకర్స్ 20 నిమిషాల సన్నివేశాలను తొలగించి, రన్‌టైమ్‌ను 2 గంటల 22 నిమిషాలకు కుదించారు.

కొన్ని సీన్లు అంచనాలను అందుకోలేకపోయాయి
బెన్ లాక్, ఆక్వామన్, స్టార్ వార్స్ వంటి చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ ఈ ప్రాజెక్ట్‌ను నడిపించారు. అయినప్పటికీ, కొన్ని సన్నివేశాలు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ కష్టాన్ని గుర్తించిన జ్యోతి కృష్ణ, స్థానిక టీమ్‌లు తక్కువ సమయంలో భారీ పనిని పూర్తి చేశాయని సమర్థించారు. అయితే కొందరు కావాలనే సినిమాలోని నెగిటివ్ పాయింట్స్(Negative points)ను ఎత్తిచూపుతూ మొత్తం సినిమాపైనే నెగిటివిటీ తీసుకురావాలని చూస్తున్నారని జ్యోతి కృష్ణ అన్నారు.
Ee Cinema start ayinapatti Nunchi chaala Mandi negative Chestunnaru. Vallandhariki answer July 24th
– #JyothiKrishna at #HHVMTrailer launch
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) July 3, 2025






