వింబుల్డన్ మెన్స్ సింగిల్స్(Wimbledon-2025 Men’s Singles)లో నయా ఛాంపియన్ అవతరించాడు. స్పెయిన్‌కు చెందిన డిఫెండింగ్ ఛాంప్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)కు షాక్ ఇచ్చి వరల్డ్ నం.1, ఇటలీ ప్లేయర్ జెన్నిక్ సిన్నర్ (Jannik Sinner) టైటిల్ ఎగురేసుకుపోయాడు. దీంతో తొలిసారిగా మెన్స్ సింగిల్స్ టైటిల్ దక్కించుకున్న ప్లేయర్‌గా సిన్నర్ రికార్డు సాధించాడు. కాగా వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలిసారే సిన్నర్ విజేతగా నిలవడం విశేషం. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో అతను డిఫెండింగ్ ఛాంపియన్ అల్కరాజ్‌ను మట్టికరిపించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో సిన్నర్ 4-6, 6-4, 6-4, 6-4 సెట్ల తేడాతో విజయం సాధించాడు.
నాలుగో గ్రాండ్‌స్లామ్ దక్కించుకున్న సిన్నర్
అల్కరాజ్‌ను నిలువరించడానికి సిన్నర్ శక్తికి మించి పోరాడాడు. మ్యాచ్ ఆరంభంలోనే అల్కరాజ్ తన పవర్ ఫుల్ షాట్లతో సిన్నర్‌కు షాకిచ్చాడు. దీంతో తొలి సెట్‌ను అల్కరాజే నెగ్గాడు. ఆ తర్వాత పుంజుకున్న సిన్నర్ వరుసగా మూడు సెట్లు గెలిచాడు. అయితే మూడు సెట్లలోనూ అల్కరాజ్ నుంచి తీవ్ర పోటీ తప్పలేదు. కానీ, సిన్నర్ పట్టు వదల్లేదు. అల్కరాజ్‌ను ఒత్తిడిలోకి నెట్టి తప్పులు చేసి వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఇటలీ(Italy) ప్లేయర్‌గా సిన్నర్ రికార్డుకెక్కాడు. ఈ ఓటమితో హ్యాట్రిక్ టైటిల్ గెలవాలని చూసిన అల్కరాజ్‌కు నిరాశ తప్పలేదు. సిన్నర్‌కు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్(Grand Slam Title) కాగా ఈ ఏడాది రెండో టైటిల్ కావడం విశేషం. ఈ సీజన్ ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, US ఓపెన్ టైటిల్స్ సాధించాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో స్వియాటెక్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే.
Jannik Sinner is a Wimbledon champion 🇮🇹
The world No.1 defeats Carlos Alcaraz 4-6, 6-4, 6-4, 6-4 to win the 2025 Gentlemen’s Singles Trophy 🏆#Wimbledon pic.twitter.com/UMnwV4Fw78
— Wimbledon (@Wimbledon) July 13, 2025






