Mana Enadu : టీం ఇండియా క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్ భారత్ లో ఎవరికీ ఉండదు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఆ తర్వాతి తరం విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ అయినా డై హర్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సచిన్ ను ఇండియాలో గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలిస్తే.. విరాట్ ను కింగ్ కొహ్లీ అని పిలుచుకుంటారు. రోహిత్ శర్మను హిట్ మ్యాన్ అని ముద్దుగా సంభోదిస్తుంటారు.
గెలిస్తే సంబరాలు చేసుకుంటారు. ఓడితే బాధపడి పోతుంటారు. తమ అభిమాన క్రికెటర్ బాగా ఆడితే ఆ రోజు పండగ చేసుకుంటారు. వాట్సాప్ స్టేటస్ లు, ఇన్ స్టాలో పోస్టులు, కామెంట్లు ఇలా ఎన్నో రకాలుగా అభిమానం కురిపిస్తుంటారు. చాలా మందికి వారిని నేరుగా కలవాలని కోరిక ఉంటుంది. కానీ అది అందరికీ నెరవేరదు. కొందరు వారిని స్టేడియంలో మ్యాచులో ఆడితే చూడాలని అనుకుంటారు. మరి కొందరు వారితో ఫొటో దిగాలని, లేదా కనీసం ఆటోగ్రాఫ్ అయినా తీసుకోవాలని తహతహలాడుతుంటారు.
ఒకవేళ ఆటోగ్రాఫ్ ఇస్తే దాన్ని భద్రంగా దాచుకుంటారు. ఇలా తమ అభిమాన క్రికెటర్ల ఆటోగ్రాఫ్ ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తుంటారు. అదృష్టం రాకపోతుందా.. ఆటోగ్రాఫ్ దొరకపోతుందా అని అనుకుంటారు. అయితే భారత క్రికెటర్ రోహిత్ శర్మ పై ఓ అభిమాని ఆటోగ్రాఫ్ కోసం మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియాలో ప్రెసిడెంట్ ఎలెవన్ తో కాన్ బెర్రాలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ గెలిచింది. కాగా ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే సమయంలో పెవిలియన్ ఎండ్ లో రోహిత్ శర్మ చాలా రోజుల తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ కు ఆటోగ్రాఫ్ లు ఇస్తున్నాడు. ఈ సమయంలో అభిమానులు అందరూ సందడిగా అరుస్తున్నారు. అక్కడే ఉన్న ఒక అభిమాని హిందీలో ‘రోహిత్ దస్ సాల్ హో గాయా యార్.. ఏక్ ఆటో గ్రాఫ్ దేనా ’ అంటూ అరిచాడు.
The wait of a decade finally ends. A fan waited for 10 years to get a @ImRo45 autograph and yesterday was his lucky day #TeamIndia pic.twitter.com/miywxlE8gA
— BCCI (@BCCI) December 2, 2024
రోహిత్ నీ ఆటోగ్రాఫ్ కోసం పదేళ్ల నుంచి వేచి చూస్తున్నా.. ఒక్క ఆటో గ్రాఫ్ ఇవ్వవా అంటూ గట్టిగా అరిచాడు. దీంతో రోహిత్ శర్మ ఒక్క సారి నవ్వుకుని ఆ అభిమాని దగ్గరకు వెళ్లి ఆటోగ్రాఫ్ ఇచ్చి పదేళ్ల కరువును తీర్చాడు. దీంతో ముంబయికి రాజా రోహిత్ బాయ్ అంటూ అభిమాని పట్టలేని సంతోషంతో అరిచాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ (ఎక్స్) అకౌంట్ లో పోస్టు చేసింది. దీంతో క్రికెటర్లపై ఫ్యాన్స్ కు ఉన్న అభిమానం ఎంటో మరోసారి రుజువైంది.






