Mana Enadu: కన్న కొడుకు వైఎస్ జగన్(YS Jagan) గురించి సంచలన విషయాలు వెల్లడిస్తూ వైఎస్ విజయమ్మ(YS Vijayamma) బహిరంగ లేఖ(An open letter) రాశారు. తాజాగా YSR అభిమానులకు ఆమె రాసిన లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖలో తన కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదాన్ని(Property dispute) వివరించారు. తమ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు తన మనసుకు చాలా బాధేస్తోందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అంటూ బాధపడ్డారు. ‘‘మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియా లో కల్పిత కథలు రాయవద్దు. దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు. సమస్యను జగన్, షర్మిలే(Jagan, Sharmila) పరిష్కరించుకుంటారు’’ అని విజయమ్మ తెలిపారు.
వాళ్లిద్దరికీ అన్నీ తెలుసు
YSR బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం చేశారన్నది అవాస్తవమని YS విజయమ్మ వెల్లడించారు. ‘విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఆడిటర్‌గా ఉండటంతో ఆయనకు అన్ని తెలుసు. వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ఇంటి బంధువుగా సాక్షి సంతకం పెట్టారు. కానీ ఇద్దరూ స్పృహ లేకుండా అవాస్తవాలు మాట్లాడారు. జగన్, షర్మిల పెరుగుతున్నప్పుడే కొన్ని ఆస్తులు జగన్, షర్మిల పేరిట రాజశేఖర్ రెడ్డి రాశారు. ఇది ముమ్మాటికి ఆస్తుల పంపకం కాదు’ అని విజయమ్మ స్పష్టం చేశారు.
జగన్ మాట మార్చాడు
జగన్ CM అయ్యాక ఆస్తుల పంపకం ప్రపోజల్ పెట్టాడని తల్లి విజయమ్మ అన్నారు. ‘ఇప్పుడు ప్రచారంలో ఉన్న MOU జగన్ చేతితో రాసిందే. హక్కు ఉంది కాబట్టే షర్మిలకు రూ.200Cr డివిడెండ్లు ఇచ్చారు. MOUలో ఉన్న సరస్వతి షేర్స్(Saraswati Shares) 100%, అందులో లేని యలహంక ప్రాపర్టీ(Yalahanka Property) 100% షర్మిలకు వెంటనే ఇస్తానని మాట ఇచ్చి సంతకం పెట్టాడు. కానీ అవి ఇవ్వకుండా అటాచ్‌మెంట్లో లేని ఆస్తుల విషయంలో పాపకు అన్యాయం చేశాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాకు ఇద్దరూ సమానమే: విజయమ్మ
ఓ తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమేనని విజయమ్మ అన్నారు. అయితే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా ధర్మం. నా విధి. ఇంతమంది పెద్దలు చెప్తున్న అబద్ధాల మధ్య నిజాలు తెలియాలనే మీ మందుకు వచ్చా. YSR బతికి ఉంటే ఆస్తుల సమస్య వచ్చేది కాదు. దీనిపై ఇక ఎవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు’ అని లేఖలో కోరారు.