
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament’s monsoon sessions) వేళ ఉప రాష్ట్రపతి(Vice President) పదవికి జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా(Resign) చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన వైదొలగడంతో ఇప్పుడు తదుపరి ఉప రాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే తెర పైకి పలువురి పేర్లు వచ్చాయి. అందులో బిహార్ సీఎం నీతీశ్ కుమార్(Bihar CM Nitish Kumar) పేరు కూడా ఉండటం గమనార్హం. మరికొన్ని నెలల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly elections) జరగనున్నాయి. ఈ రాష్ట్రానికి కొన్నేళ్ల పాటు సీఎంగా కొనసాగుతున్న నీతీశ్ కుమార్ (Nitish Kumar) ఇకనైనా ఆ కుర్చీని వీడి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని NDA కూటమిలో పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జగదీప్ ధన్‌ఖడ్ స్థానంలో బిహార్ సీఎంకి ఉప రాష్ట్రపతి పదవి కల్పించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెరపైకి శశిథరూర్ పేరు
మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్(COngress)కు క్రమంగా దూరమవుతున్న సీనియర్ MP శశిథరూర్ (Shashi Tharoor)కి కూడా ఉపరాష్ట్రపతి పదవి దక్కొచ్చనే వార్తలు వస్తున్నాయి. దీంతో త్వరలోనే ఆయన హస్తానికి గుడ్‌బై చెప్పి భాజపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి థరూర్ నేతృత్వం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజా రేసులో థరూర్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను పార్టీలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరితో పాటు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేడీయూ హరివంశ్ నారాయణ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena), జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా(Manoj Sinha) పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దీంతో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరదనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Who are the likely contenders for the post of India’s Vice President?
— A political journalist posted that Bihar CM Nitish Kumar could be next VP.
— Defence Minister Rajnath Singh’s name also surfaced.
— Another senior journalist shared that Congress MP Shashi Tharoor is among… pic.twitter.com/fypPMycov9
— Nitesh Sharma (@nitesh1572) July 22, 2025