తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించి పాపులర్ అయిన నటి పార్వతీ నాయర్ (Parvati Nair). ఈ భామ తెలుగులో నేచురల్ స్టార్ నాని (Nani)తో కలిసి ‘జెండాపై కపిరాజు’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత పలు భాషల్లో సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఈ భామ తన లైఫ్ లో కొత్త చాప్టర్ మొదలు పెట్టబోతోంది. ఇందుకు సంబంధించిన గుడ్ న్యూస్ ను తన అభిమానులతో సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేసుకుంది.

ఆశ్రిత్ తో పార్వతీ వివాహం
నటి పార్వతీ నాయర్ (Parvati Nair Marriage) త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్ ను ఈ భామ వివాహమాడనుంది. ఇటీవలే చెన్నైలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను పార్వతీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినీ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.
View this post on Instagram
ఆ ఈవెంట్ లో కలిశారు
పార్వతికి, ఆశ్రిత్ (Parvati Nair Husband Name) ఓ ప్రైవేట్ ఈవెంట్ లో కలిశాడట. అక్కడ వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. అలా ఈ జంట కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి వీరి ప్రేమ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పగానే వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక చెన్నైలో వీరి వివాహం మలయాళం, తెలుగు సంప్రదాయాల్లో జరగనుందట. వివాహానంతర వేడుకలు కేరళలో జరుగుతాయని పార్వతీ చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి ఎప్పుడో మాత్రం చెప్పలేదు.






