కేన్స్ చిత్రోత్సవాలు (Cannes Film Festival) అట్టహాసంగా సాగుతున్నాయి. ఫ్రాన్స్లో జరుగుతున్న 78వ కేన్స్ ఉత్సవాల్లో హాలీవుడ్తోపాటు బాలీవుడ్ తారలు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తొలిసారి కేన్స్‌లో మెరిసింది.
పొడవాటి గౌన్‌ను ధరించి రాచరికం ఉట్టిపడేలా రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. జాన్వీ లుక్ చూసినవారంతా శ్రీదేవి గుర్తుకు వస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఏకైక భారతీయ చిత్రం హోమ్ బౌండ్ ప్రదర్శన
జాన్వీతో పాటు ‘హోమ్ బౌండ్’ చిత్రబృందం కూడా కేన్స్‌కు హాజరైంది. రెడ్ కార్పెట్‌పై జాన్వీకి ఇషాన్ ఖట్టర్ సాయం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇషాన్ ఖట్టర్ (Ishaan Khatter), జాన్వీ కపూర్ జంటగా నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ‘హోమ్ బౌండ్’ (Home Bound) సినిమాని ఆ వేడుకలో ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది కేన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఇది టీమ్‌కు దక్కిన గౌరవం అని జాన్వీ అన్నారు. దీనికోసం చిత్రబృందమంతా అక్కడికి చేరుకుంది.
View this post on Instagram
24 వరకు జరగనున్న వేడుకలు
ఈనెల 13న ప్రారంభమైన కేన్స్ సినీ వేడుక 24 వరకు జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇప్పటికే కొందరు నటీనటులు పాల్గొని సందడి చేశారు. ఎంపిక చేసిన చిత్రాలను వేడుకల్లో ప్రదర్శిస్తున్నారు. అవార్డులు అందజేస్తున్నారు.






