National Award for #JaniMaster Canceled!
Jani Master, was arrested after a 21-year-old woman accused him of sexually assaulting her, when she was a minor. He faces serious charges under POSCO.
The Awards Committee has cancelled the award for the choreographer. On October 4,… pic.twitter.com/TvwwE8nuLS
— PaniPuri (@THEPANIPURI) October 6, 2024
Mana Enadu : ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ (Jani Master)కు మరో షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ (National Film Award Cell) ఒక ప్రకటన విడుదల చేసింది. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో అవార్డు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు
2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ మాస్టర్ ఎంపికైన విషయం తెలిసిందే. ఈనెల 8వ తేదీన దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో పురస్కారం పొందేందుకు జానీ మాస్టర్‌కు ఆహ్వానం కూడా అందింది. అయితే లైంగిక్ వేధింపులు, మైనర్ పై అత్యాచారం కేసులో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అవార్డు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ ప్రకటించింది.
అసలు ఏంటీ కేసు?
జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. జానీ మాస్టర్ ఆ అమ్మాయిపై మైనర్ గా ఉన్న సమయంలోనే అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
జానీ మాస్టర్ కు బెయిల్
జానీ మాస్టర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపుల అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఆయనకు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెల్ పేర్కొంది. అలాగే ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దిల్లీలో జరిగే అవార్డు ఫంక్షన్ కోసం జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పొందిన విషయం తెలిసిందే. ఇందుకు ఆయనకు న్యాయస్థానం ఈనెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ అవార్డును వెనక్కి తీసుకోవడం గమనార్హం.