Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్? ఏంటో తెలుసా!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల లైంగిక వేధింపుల కేసు(sexual assault allegations)లో అరెస్ట్ అయ్యి కొన్ని రోజుల తర్వాత బెయిల్‌పై బయటికొచ్చిన ఆయనకు డ్యాన్సర్స్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. తాజాగా ఆయన్ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(Dancers Association) నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ అసోసియేషన్‌కు సంబంధించి జరిగిన ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రకాశ్(Prakash) ఎన్నికతో అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్‌ను తొలగించారు.

జానీ మాస్టర్‌కు తగ్గని అవకాశాలు

ఈ ఎన్నికల్లో జానీ మాస్టర్(Jany Master) ఓటమికి ఇటీవల జరిగిన పరిణామాలే కారణమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జానీ మాస్టర్‌కు ఇప్పుడు టాలీవుడ్‌(Tollywood)లో పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. అరెస్ట్(Arrest) అవ్వకముందు ఒప్పుకున్న సినిమాల నుంచి కూడా మేకర్స్ జానీ మాస్టర్‌ను తప్పించి ఆయన ప్లేస్‌లో మరొకర్ని తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ ఇతర ఇండస్ట్రీలో ఆఫర్స్(Offers) కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం.

37 రోజుల పాటు జైలు జీవితం

ఇదిలా ఉండగా జైలు(Jail) నుంచి బయటకు వచ్చాక ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌(Pre release event)లో జానీ మాస్టర్ పాల్గొన్నారు. కష్టకాలంలో తనకు భార్య, అభిమానులు అండగా నిలిచారని చెప్పారు. తనను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్(Thanks) చెప్పారాయన. ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరూ కనబడరు, కానీ నన్ను మీ ఇంటి పిల్లాడిలా ఆశీర్వదించారని చెప్పారు. నాపై నమ్మకం పెట్టుకున్నారన్న జానీ మాస్టర్.. త్వరలోనే అదేంటో తెలుస్తుందని చెప్పుకొచ్చారు. కాగా తన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగాలతో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. 37 రోజుల పాటు జైలు జీవితం గడిపిన అతను బెయిల్‌(Bail)పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *