Airtel: జియో బాటలోనే ఎయిర్‌టెల్.. 1జీబీ ప్లాన్ నిలిపివేత!

ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో(Reliance Jio), ఎయిర్‌టెల్(Airtel) వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చాయి. జియో తన రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను, రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్, 100 SMSలతో 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న పాపులర్ ప్లాన్‌ను తొలగించింది. ఈ నిర్ణయం వినియోగదారుల్లో ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈ ప్లాన్(Plan) తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు అందించేది. జియో ఈ నిర్ణయం వెనుక సగటు ఆదాయం (ARPU) పెంచుకోవడం, భవిష్యత్తులో IPO ఓ కోసం సన్నద్ధత ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు జియో కనీస ప్లాన్ రూ.299 నుంచి మొదలవుతుంది, ఇది రోజుకు 1.5జీబీ డేటా అందిస్తుంది.

ఈ రోజు నుంచి అందుబాటులో ఉండదు..

తాజాగా జియో బాటలోనే ఎయిర్‌టెల్(Airtel) కూడా తన రూ.249 ఎంట్రీ-లెవల్ ప్లాన్‌ను నిలిపివేసింది. ఈ ప్లాన్ కూడా 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లను 28 రోజుల వ్యాలిడిటీతో అందించేది. ఈరోజు (ఆగస్టు 20) నుంచి ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు. ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం ద్వారా ఎక్కువ డేటా ఉన్న ఖరీదైన ప్లాన్‌ల వైపు వినియోగదారు(Users)లను నెట్టివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మార్పులు వినియోగదారులకు ఆర్థిక భారాన్ని పెంచుతాయని, ముఖ్యంగా తక్కువ డేటా అవసరమైన వారికి ఇబ్బంది కలిగిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జియో, ఎయిర్‌టెల్ రెండూ ఎక్కువ డేటా ప్లాన్‌లను ప్రోత్సహిస్తూ, బడ్జెట్(Budget) ఆప్షన్‌లను తొలగిస్తున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *