ఇంగ్లాండ్-భారత్ మధ్య జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ డిజిటల్ హక్కులను (JioHotstar) జియో హాట్ స్టార్ దక్కించుకుంది. దేశంలోని ప్రముఖ క్రికెట్ వార్తా సంస్థ (Cricbuzz )సమాచారం ప్రకారం, జియో హాట్ స్టార్ సోని ఎంటర్ టైన్ నెట్ వర్క్ మధ్య ఈ డిజిటల్ ఒప్పందం కుదిరింది.
డిజిటల్ హక్కులు జియో హాట్ స్టార్‌కే
2031 వరకు ఇంగ్లండ్‌లో జరిగే మ్యాచ్‌లను ప్రసారం చేసే అన్ని హక్కులను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత జియో హాట్ స్టార్ కు సోనీ డిజిటల్ ప్రసార హక్కులను ఇస్తూ ఒప్పందం చేసుకుంది. జియో హాట్ స్టార్ ఇప్పటికే ఇండియాలో జరిగే ఐసీసీ టోర్నమెంట్ లు, ఐపీఎల్, బోర్డర్, గవాస్కర్ ట్రోపీల ప్రసార హక్కులు కలిగి ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్ – ఇండియా England vs India మధ్య టెస్ట్ సిరీస్ డిజిటల్ హక్కులు కూడా దక్కించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 2026లో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల డిజిటల్ హక్కులు కూడా (JioHotstar) జియో హాట్ స్టార్ కి ఉండనున్నాయి.
జూన్ 20 నుంచి
ఇంగ్లాండ్ తో ఇండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ (virat kohli) రిటైర్మెంట్ నేపథ్యంలో టీమిండియాకు సరికొత్త చాలెంజ్ ఎదురుకానుంది. బంతి గమనం మార్చుకుని గాల్లో వేగంగా స్వింగ్ అవుతూ దూసుకెళ్లే ఇంగ్లండ్ పిచ్ లపై భారత బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారనేది ఇప్పుడు ముందున్న సవాల్. దీన్ని అధిగమించేందుకు అన్ని రకాల సిద్ధమేనని టీం ఇండియా ప్రకటించింది.
ఇంగ్లాండ్‌లో జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ ల షెడ్యూల్
* తొలి టెస్ట్ – జూన్ 20 నుంచి లీడ్స్
* రెండో టెస్ట్ – జూలై 2 నుంచి బర్మింగ్ హమ్
* మూడో టెస్ట్ – జూలై 10 నుంచి లార్డ్స్
* నాలుగో టెస్ట్ – జూలై 23 నుంచి మాంచెస్టర్
* ఐదవ టెస్ట్ – జూలై 31 నుంచి ఓవల్






