ఫ్యామిలీ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family) ఓటీటీ రిలీజ్కు రెడీ అయింది. శశి కుమార్ (Sasikumar), సిమ్రన్ (Simran) జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న తమిళనాట విడుదలై సంచలన విజయం సాధించింది. కేవలం రూ.8 కోట్లతో నిర్మించిన మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాను చూసిన రాజమౌళి, రజినీకాంత్, నేచురల్ స్టార్ నాని, శివరార్తికేయన్ లాంటి వారు ఈ సినిమాను ఆకాశానికెత్తారంటే మూవీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో తాను చూసిన బెస్ట్ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ అని రాజమౌళి అన్నారు. డైరెక్టర్ అభిషాన్ జీవింత్ను ప్రశంసించారు.
ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తూ..
ఇటీవల వస్తున్న మాష్,మసాలా, రొట్ట కొట్టుడ, బ్లడీ వయలెన్స్ సినిమాలను చూస్తూ అలసిపోయిన, మోహం వాచిన వారికి ఈ సినిమా ఎంతో రిఫ్రెషింగ్ లాంటింది. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న దంపతులు పిల్లలతో కలిసి శ్రీలంక నుంచి అక్రమంగా భారత్కు వచ్చి చెన్నైలోని ఓ కాలనీలో అద్దెకు దిగుతారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ అక్కడి వారితో వ్యహరించిన తీరు, ఎవరితో సంబంధం లేకుండా జీవిస్తున్న వారిలో తెచ్చిన మార్పులతో సాగే సినిమా అసాంతం నవ్వులు పూయిస్తుంది. ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తూ కంటతడి పెట్టించేలా సాగుతుంది.
అందుకే ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. దీంతో ఈ మూవీని ఓటీటీలో చూడాలని భావిస్తున్న వారి ఎదురుచూపులకు తెరపడనుంది. చిత్రం జియో హాట్‌స్టార్ (Jio Hotstar)తో పాటు సింపుల్ సౌత్ ఓటీటీల్లో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లో జూన్2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.






