Hemant Soren Oath: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్‌ సోరెన్‌.. నాలుగోసారి ప్రమాణం

ఝార్ఖండ్‌(Jharkhand)లో కొత్త ప్రభుత్వం(New Govt) కొలువుదీరింది. ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌(CM Hemant Soren) గురువారం ప్రమాణస్వీకారం(Oath Taking) చేశారు. స్థానిక మోరాబాది గ్రౌండ్‌లో గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌(Governor Santosh Kumar Gangwar) ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress President Mallikarjuna Kharge), లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi), సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌(Akhilesh Yadav)లు హాజరయ్యారు. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(Jharkhand Mukti Morcha) అధ్యక్షుడిగా హేమంత్‌ సోరెన్‌ CMగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం.

ఐక్యతే పెద్ద ఆయుధం: సోరెన్‌

ఝార్ఖండ్‌(Jharkhand) ప్రజలకు ఐక్యతే పెద్ద ఆయుధమని, దాన్ని ఎవరూ విడదీయలేరని, వారిని అణచివేయలేరని హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారానికి ముందు ట్విటర్(X)లో పేర్కొన్నారు. విప్లవాన్ని ఎంతగా అణచివేయాలని చూస్తే అంతకన్నా వేగంగా ఉవ్వెత్తున ఎగసిపడుతుందని పరోక్షంగా BJP నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానికి చురకలంటించారు. ఝార్ఖండీలు ఎవరికీ తలవంచరని చివరి వరకు పొరాటం కొనసాగిస్తారని” అని హెచ్చరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక(Assembly elections)ల్లో సోరెన్‌ 39,791 ఓట్ల తేడాతో BJP నేత గామ్లియేల్‌ హెంబ్రోమ్‌ను ఓడించి బర్హైత్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 81 మంది సభ్యులు కలిగిన రాష్ట్ర అసెంబ్లీలో JMM కూటమి 56 స్థానాలను కైవసం చేసుకోగా, NDA కేవలం 24 స్థానాల్లో విజయం సాధించింది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *