జర్నలిజం( Journalisum) అంటే కేవలం వార్తలు అందించడమే కాదు…నిజాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే తపనతో ఎలాంటి ప్రమాదాలకైనా సిద్ధంగా ఉండే వృత్తి జర్నలిజం. నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో జర్నలిస్టులు( Journalist) తమ ప్రాణాలను సైతం ప్రమాదంలోకి వేస్తుంటారు. యుద్ధాలు జరుగుతున్నా, ప్రకృతి విపత్తులు ఉన్నా, వైరస్‌లు విజృంభిస్తున్నా కూడా మౌనంగా కూర్చోవడం లేదు.
ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్ బారి వర్షాలు, వరదల గురించి లైవ్ రిపోర్టింగ్(Live Reporting) చేస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన పాకిస్థాన్(Pakistan)లోని రావల్పిండిలో జరిగింది. మెడ వరకు నీటిలో నిలబడి, మైక్రోఫోన్ పట్టుకొని వార్తలు అందిస్తున్న సమయంలో అకస్మాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో ఆయన అదుపుతప్పి వరదలో మునిగిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘అల్ అరేబియా ఇంగ్లీష్’ ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు జర్నలిస్టు ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు అటువంటి ప్రాణహానికర పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేయడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
🚨A Pakistani journalist lost his life while reporting from a flood-stricken area.
The reporter had traveled to the disaster zone to cover the devastating floods in Pakistan. #Pakistan #Floods #Journalis #ExtremeWeather #TamadonNews pic.twitter.com/BTgCb3DwuR— Tamadon News – English (@TamadonTV_EN) July 17, 2025






