తాత ఆశీస్సులు.. మీ ప్రేమ ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు: NTR

తన తాత, దివంగత నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao)త ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని హీరో జూనియర్ ఎన్టీఆర్‌(Jr. NTR) ధీమా వ్యక్తం చేశారు. బాలీవుడ్(Bollywood) కండల వీరుడు హృతిక్‌ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2(War-2)’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక(Pre-release Event) హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో ఆదివారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ తన సినీ ప్రయాణం, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘వార్ 2’ సినిమా చేయడానికి కథ ప్రధాన కారణం కాదు. నిర్మాత ఆదిత్య చోప్రా(Adhitya Chopra) గారు ‘నువ్వు ఈ సినిమా చేయాలి, నీ అభిమానులు గర్వపడేలా తీస్తాను’ అని నాకు మాట ఇచ్చారు. కేవలం ఆ మాటను నమ్మి ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను’’ అని ఎన్టీఆర్‌ స్పష్టం చేశారు. ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు అయాన్ ముఖర్జీ(Ayaan Mukharji)కి, యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Image

భారత్‌లోనే గొప్ప నటుడు, డ్యాన్సర్ హృతిక్

ఇక కో యాక్టర్ హృతిక్‌ రోషన్‌పై ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘భారత్‌లోనే గొప్ప నటుడు, డ్యాన్సర్ హృతిక్ రోషన్. 25 ఏళ్ల క్రితం ‘కహోనా ప్యార్ హై(Kahona Pyar Hai)’లో ఆయన డ్యాన్స్ చూసి మంత్రముగ్ధుడినయ్యాను. అలాంటి వ్యక్తితో కలిసి డ్యాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ఇది తన హిందీ సినిమా మాత్రమే కాదని, హృతిక్ చేస్తున్న తెలుగు సినిమా కూడా అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

Image

ఇంతమంది అభిమానుల ప్రేమను పొందడం నా అదృష్టం

తన 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ NTR భావోద్వేగానికి గురయ్యారు. ‘‘రామోజీరావు గారు నన్ను పరిచయం చేసినప్పుడు నా పక్కన అమ్మ, నాన్న తప్ప ఎవరూ లేరు. అప్పుడు నన్ను కలిసిన మొదటి అభిమాని మూజీబ్. అక్కడి నుంచి మొదలైన ప్రయాణంలో ఇంతమంది అభిమానుల ప్రేమను పొందడం నా అదృష్టం. నన్ను నిరంతరం ప్రోత్సహించిన నాన్న హరికృష్ణ(Harikrishna), అమ్మ షాలినితో పాటు దర్శకనిర్మాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అని తెలిపారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌(Yash Raj Films) స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కియారా అడ్వాణీ(Kiara Advani) కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *