
భారీ ప్రాజెక్టులతో జోరుమీదున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). ఆయన చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 (WAR 2)తో నటిస్తూ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దీని తర్వాత ‘దేవర 2’తోపాటు తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
కోడై కూస్తున్న బాలీవుడ్
ఇదిలా ఉంటే ఇప్పుడి ఎన్టీఆర్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో యంగ్ టైగర్ కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke Biopic) జీవితం ఆధారంగా దీన్ని రూపొందించనున్నట్లు సమాచారం.
నాడు రాజమౌళి ప్రకటించిన మూవీనే..
రెండేళ్ల క్రితం దర్శకుడు రాజమౌళి సమర్పణలో ‘మేడ్ ఇన్ ఇండియా’ (Made In India) అనే బహు భాషా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఆయన కుమారుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు. ఆ ప్రాజెక్ట్కు సంబంధించిన విషయం ఇప్పుడు ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. భారతీయ సినిమా గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ మూవీలో ఎన్టీఆర్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, టీమ్ మొత్తం దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని తెలిపిది.