ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(High Court of Andhra Pradesh) న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్(Justice Battu Devanand) ఈరోజు (జులై 28) ఉదయం ప్రమాణస్వీకారం(swearing in) చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్(CJ Dheeraj Singh Thakur) ఆయనతో ప్రమాణం చేయించారు. మద్రాస్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ దేవానంద్, 2020 జనవరి 13న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 10న మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం(Supreme Court Collegium) సిఫార్సుతో ఆయన మళ్లీ ఏపీ హైకోర్టుకు తిరిగి వచ్చారు.
గుడివాడలో జన్మించిన జస్టిస్ దేవానంద్
కాగా 1966లో కృష్ణా(Krishna District) జిల్లా గుడివాడలో జన్మించిన జస్టిస్ దేవానంద్, ఆంధ్రా యూనివర్సిటీ(Andhra University) నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. 1989లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్(Andhra Pradesh Bar Council)లో న్యాయవాదిగా చేరారు. విశాఖపట్నం జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ చేసిన ఆయన, 2014-19 మధ్య హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా సేవలందించారు. అమరావతి రైతుల మూడు రాజధానుల వ్యతిరేక ఉద్యమంలో కీలక తీర్పులు ఇచ్చిన ఆయన, న్యాయవ్యవస్థలో నిజాయతీ, నిష్పక్షపాతంతో పేరు గడించారు. ఆయన ప్రమాణ స్వీకారంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం..
జస్టిస్ దేవానంద్ తో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..
2028 ఏప్రిల్ 13 వరకు పదవిలో కొనసాగనున్న జస్టిస్ బట్టు దేవానంద్..#Devanand #ApHighCourt #AndhraPradesh pic.twitter.com/qP7xpkNGZE— Telugu Stride (@TeluguStride) July 28, 2025






