
రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)లో బుధవారం ఉదయం సుప్రీం కోర్టు (Supreme Court) 52వ ప్రధాన న్యాయమూర్తిగా (52nd CJI of India) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (Justice Bhushan Ramakrishna Gavai) ప్రమాణం (oath ceremony) చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) జస్టిస్ గవాయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు,గవర్నర్లు తదితరులు హాజరయ్యారు.
1985లో లా ప్రాక్టీస్..
గవాయ్ పూర్తిపేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. 1960 నవంబర్ 24న మహారాష్ట్ర(MH)లోని అమరావతిలో జన్మించారు. అంబేడ్కర్ సూత్రాలను అవలంబించిన కుటుంబంలో ఆయన జన్మించారు. 1985లో లా ప్రాక్టీస్(Law Practic) ప్రారంభించిన తర్వాత, భోసలే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు. అంతకుముందు మునిసిపల్ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా కూడా పనిచేశారు. జస్టిస్ బీఆర్ గవాయి తండ్రి ఆర్ఎస్ గవాయ్ (RS Gavai). ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(Republican Party of India)లో ముఖ్య నేత. బిహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా చేశారు.
Attended the swearing in ceremony of Justice Bhushan Ramkrishna Gavai as the Chief Justice of the Supreme Court of India. Wishing him the very best for his tenure. pic.twitter.com/xzJhsQsRAa
— Narendra Modi (@narendramodi) May 14, 2025