
Mana Enadu : తమిళనాడు (TamilNadu) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalai) ఆరు కొరడా దెబ్బలు భరించి.. మురుగన్‌కు మొక్కు చెల్లించుకున్నారు. చెన్నైలోని (Chennai) అన్నా యూనివర్సిటీలో (Anna University) ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుమారం రేపడంతో ఆయన డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను పాదరక్షలు ధరించనని ప్రతిజ్ఞ చేశారు.
చెప్పులు లేకుండా నడుస్తా
డీఎంకే సర్కార్ ను గద్దె దించే వరకు తాను చెప్పులు లేకుండానే నడుస్తానని అన్నామలై (Annamalai Flogged) ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి తాము డబ్బులు ఎరగా చూపం అని స్పష్టం చేశారు. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించేంతవరకు చెప్పులు ధరించనని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
ఆరు కొరడా దెబ్బలు
రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులోని తన నివాసంలో అన్నామలై ఆరు కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. అనంతరం మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని తెలిపిన ఆయన.. రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటలపాటు ఉపవాస దీక్ష చేపడతానని వెల్లడించారు. అన్న మాట ప్రకారమే శుక్రవారం రోజున కోయంబత్తూర్‌లోని తన ఇంటి వద్ద బీజేపీ మద్దతుదారులు, మీడియా సమక్షంలో మొక్కు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
This is painful 😣💔😞
Tamilnadu voters should vote wisely in 2026 🙏🏻
Annamalai anna 😭 #ShameOnYouStalin #JusticeForAnnaUniversity_Girl #AnnaUniversity #DMKProtectsRapists #DMKFailsTN#Annamalai 🙏🏻 pic.twitter.com/tCuKYf8lVH
— Esha Srivastav🇮🇳🚩 (@EshaSanju15) December 27, 2024