CAG: కాగ్​ అధిపతిగా తెలుగు వ్యక్తి.. ప్రమాణం చేసిన సంజయ్​ మూర్తి

భారత ప్రతిష్ఠాత్మక సంస్థ కంప్ట్రోలర్​ అండ్​ జనరల్​ (కాగ్​) (CAG)బాధ్యతలను తెలుగు వ్యక్తి కొండ్రె సంజయ్​ మూర్తి (Sanjay Murthy) చేపట్టారు. కాగ్​ అధిపతిగా గురువారం ఆయన ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్​ మూర్తి అరుదైన ఘనత సాధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో సంజయ్​ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ప్రమాణం చేయించారు.

ఆంధ్రప్రదేశ్​లోని అమలాపురం మాజీ ఎంపీ కేఎస్​ఆర్​ కుమారుడే సంజయ్​. 1964 డిసెంబర్​ 24న జన్మించిన ఆయన ఇంజినీరింగ్​ పూర్తిచేసి ఆ తర్వాత సివిల్స్​ సాధించారు. ఐఏఎస్​ (IAS) అధికారిగా 1989లో హిమాచల్​ ప్రదేశ్​ కేడర్​కు ఎంపికై సమర్థంగా విధులు విర్వహించారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 2021 సెప్టెంబర్​ నుంచి విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉన్నత విద్యా శాఖలో కార్యదర్శిగా పనిచేస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో కీలక పాత్ర పోషించారు.

సంజయ్​ మూర్తి ఈ డిసెంబర్​లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా.. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కాగ్​ అధిపతిగా కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు లేదా, 65 ఏళ్ల వయసు వరకు కొనసాగేందుకు వీలుంది. గతేడాది నవంబరు 20 కాగ్​ అధిపతిగా గిరీష్ చంద్ర ముర్ము పదవీ విరమణ చేయగా ఆ స్థానాన్ని సంజయ్​ మూర్తి తాజాగా భర్తీ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *