Mana Enadu: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘క(KA)’. ఈ సినిమాకు ఇద్దరు డైరెక్టర్లు సుజీత్, సందీప్(Sujeeth and Sandeep) దర్శకత్వం వహించారు. తన్వి రామ్, నయని సారిక హీరోయిన్లు(Tanvi Ram and Nayani Sarika)గా నటించారు. పీరియడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో క సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ప్రీమియర్ షో(Premiere Shows)లతో ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళి(Diwali) ఫెస్టివల్ నేపథ్యంలో గురువారం (OCT 31న) పూర్తి స్థాయిలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈమూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేడ్ వచ్చేసింది.
నాలుగు వారాల తర్వాతే..
తాజాగా క మూవీకి సంబంధించి డిజిటల్ హక్కులు(Digital rights) ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ సమాచారం కూడా వెల్లడైంది. ఈటీవీ విన్(ETV Win) ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ మూవీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అలాగే, శాటిలైట్ హక్కులను కూడా ఈటీవీ రూ.10 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్లలో రిలీజైన 4 వారాల తర్వాత ‘క’ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇది థియేట్రికల్ రన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ మూవీకి లాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగితే మాత్రం స్ట్రీమింగ్కు రావడం ఆలస్యం కావొచ్చు.
పోస్ట్‌మ్యాన్ పాత్రలో కిరణ్
మధ్యాహ్నమే చీకటి పడే గ్రామంలో ఈ సినిమా స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో పోస్ట్‌మ్యాన్(Postman) పాత్ర పోషించారు కిరణ్ అబ్బవరం. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై(Shree Chakras Entertainment banner)పై చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ మూవీని నిర్మించారు. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. విశ్వాస్ డానియెల్, సతీశ్ రెడ్డి ఈ మూవీకి సినిమాటోగ్రఫీ చేయగా శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ చేశారు. కాగా ఈ మూవీకి సంబంధించి మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) అతిథిగా హాజరయ్యారు.






