
నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘అర్జున్ S/o వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). డై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయశాంతి (Vijay Santhi) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా సందడి చేయనుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ (Sohail Khan) మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీకి సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు.
ఏప్రిల్ 18న థియేటర్లలోకి
అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఏప్రిల్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇటీవల కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఇద్దరు పవర్‌ఫుల్ డైలాగ్‌లతో టీజర్ మెప్పించడంతో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది.
NANDAMURI KALYANRAM – VIJAYASHANTHI: ‘ARJUN S/O VYJAYANTHI’ RELEASE DATE LOCKED… 18 April 2025 is the theatrical release date of #Telugu film #ArjunSonOfVyjayanthi.
Starring #NandamuriKalyanRam with #Vijayashanthi, the film is directed by #PraddeepChilukuri.
Also stars… pic.twitter.com/7MvTF6conB
— taran adarsh (@taran_adarsh) April 3, 2025
తల్లీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో..
ఇక ఈ సినిమా తల్లీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగినట్లు టీజర్‌లో చూపించారు. అలాగే సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని ధర్మంగా ఎదిరించే పాత్రల్లో కళ్యాణ్ రామ్, విజయశాంతి కనిపించనున్నారు. అశోకా క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక శ్రీకాంత్, పృథ్వీ వంటి నటులు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.