యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), వెటరెన్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్(Thug Life)’. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఈ మూవీపై సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో శింబు(Shimbu) కూడా నటిస్తుండటంతో మల్టీస్టారర్ చిత్రంగా ఈ మూవీపై కోలీవుడ్(Kollywood)లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర అఫిషియల్ ట్రైలర్(Trailer)ను మేకర్స్ రిలీజ్ చేశారు. మణిరత్నం స్టయిల్లో కమల్ హాసన్ మార్క్ మిస్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
ఈనెల 24న ఆడియో లాంచ్ ఈవెంట్
ఇందులో కమల్ హాసన్, శింబు, త్రిష(Trisha), ఐశ్వర్యలక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, జోజు జార్జ్, నాజర్, మహేశ్ మంజ్రేకర్, అలీ ఫజల్ నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం థగ్ లైఫ్ చిత్రానికి అదనపు ఆకర్షణ. కాగా భారత్-పాకిస్థాన్(India-Pak War Crisis) మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన ఆడియో లాంచ్ ఈవెంటు(Audio Launch Event)ను ఈనెల 24న నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ మూవీ జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు 36 ఏళ్ల క్రేజీ కాంబోలో వస్తున్న మూవీ ట్రైలర్‌ను మీరూ చేసేయండి.






