Kannappa First Day Collections: తొలి రోజు వసూళ్లు చూస్తే షాక్ అవుతారు! విష్ణు కెరీర్‌లో హైయెస్ట్ ఓపెనింగ్..

మంచు విష్ణు(Manchu Vishnu) అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”(Kannappa) జూన్ 27న థియేటర్లలో విడుదలై మంచి బజ్‌తో తెరపైకి వచ్చింది. రిలీజ్‌కి ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం, ఫస్ట్ డే ఇండియా వైడ్‌గా రూ.9 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ (Sacnilk) తెలిపిన వివరాల ప్రకారం, తెలుగు వర్షన్‌లో ఒక్కటే రూ.8 కోట్లు నెట్ వసూళ్లు వచ్చాయి. తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి మిగతా రూ.1 కోట్లకు పైగా వసూలయ్యాయి. మొత్తం ఓవరాల్‌గా: తెలుగు: ₹8 కోట్లు, హిందీ: ₹0.6 కోట్లు, మలయాళం: ₹0.15 కోట్లు, తమిళం: ₹0.1 కోట్లు, కన్నడ: ₹0.1 కోట్లు వసూళ్లు చేసినట్టు సాక్నిల్క్ తెలిపింది.

ఈ కలెక్షన్లతో కన్నప్ప చిత్రం విష్ణు కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. గతంలో ఆయన నటించిన చాలా సినిమాలు ఫుల్ రన్‌లో రూ.10 కోట్లు కూడా వసూలు చేయలేకపోయాయి. అలాంటి పరిస్థితుల్లో, ఒక్కరోజులోనే రూ.9 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం.

ఆక్యుపెన్సీ హై లెవెల్‌లో!

తెలుగు వెర్షన్ తొలిరోజు సగటున 55.89% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఉదయం షోలు 50.55%, మధ్యాహ్నం 50.34%, సాయంత్రం 52.81% కాగా, రాత్రి షోలలో 69.87%తో అత్యధిక ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. ఇది సినిమా క్రేజ్‌ను ప్రతిబింబిస్తుంది.

ముందస్తు అంచనాలకు తక్కువ వసూళ్లు

రిలీజ్‌కి ముందు మేకర్స్ ఈ చిత్రం ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు. భారత్‌లో తెలుగు వర్షన్ రూ.16 కోట్ల నెట్, హిందీ రూ.4 కోట్లు, మిగతా భాషల ద్వారా రూ.1 కోటి కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు భావించారు. కానీ ఈ అంచనాలకు భిన్నంగా వసూళ్లు నమోదయ్యాయి. అయినప్పటికీ, ఇది మంచు విష్ణు సినిమాల్లో అత్యుత్తమ ఓపెనింగ్ కావడం విషయం.

పబ్లిక్ టాక్ ఎలా ఉంది?

ఆడియన్స్‌, రివ్యూవర్స్ అభిప్రాయాల ప్రకారం, సెకండ్ హాఫ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. మంచు విష్ణు నటన, ముఖ్యంగా ప్రభాస్ వన్ మినిట్ గెస్ట్ అప్పీరెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుందంటున్నారు. విష్ణు పోషించిన “తిన్నడు” పాత్రకి మంచి స్పందన లభిస్తోంది. తల్లిదండ్రులు తప్ప మరో దైవం లేదని నమ్మే తిన్నడు ఎలా కన్నప్పగా మారాడన్న కథా ప్రవాహం భావోద్వేగభరితంగా ఉండటంతో క్లైమాక్స్ లో పలు చోట్ల ఆడియన్స్ కంటతడి పెట్టారు.

ఇప్పుడు ఫోకస్ వీకెండ్ కలెక్షన్లపై

ఫస్ట్ డే హైప్‌కి తగ్గ రీతిలో కలెక్షన్లు రావడంతో, ఈ వీకెండ్‌లో సినిమా ఎంత వసూలు చేస్తుందన్న ఆసక్తి ట్రేడ్ సర్కిల్స్‌లో నెలకొంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో కలిపి, ప్రస్తుత బాక్సాఫీస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే, కన్నప్ప మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *