మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో శ్రద్ద పెట్టి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘కన్నప్ప’(Kannappa ) చిత్రాన్ని రూపొందించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Sing) దర్శకత్వం(Director) వహించారు. జూన్ 27(July 27)న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా, మొదటి వారం పూర్తయ్యేలోపు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, వాస్తవ పరంగా అయితే సినిమా బాక్సాఫీస్(Box Office Collections ) వద్ద స్లోగా నడుస్తోంది. ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం, భారత్‌లో ఇప్పటి వరకు ఈ చిత్రం ₹30.14 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. వరల్డ్‌వైడ్‌గా ఇండియా గ్రాస్ మరియు ఓవర్సీస్ కలిపి ₹55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్టు సమాచారం.
అయితే ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ విషయంలోనూ అంతగా ఆకట్టుకోలేకపోయింది. జూలై 3(July 3)న, ఏడో రోజు(One Week) తెలుగు వెర్షన్‌కి 12.89% మాత్రమే ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోలు 11.06%, నైట్ షోలు 13.99%గా ఉండటంతో కాస్త మెరుగైన సూచన కనిపించినా, గురువారం మొత్తం ఆక్యుపెన్సీ మాత్రం కేవలం 6.61% మాత్రమే.
రోజువారీ కలెక్షన్లు:
డే 1: ₹9.25 కోట్లు
డే 2: ₹7.15 కోట్లు
డే 3: ₹6.9 కోట్లు
డే 4: ₹2.30 కోట్లు
డే 5: ₹1.18 కోట్లు
డే 6: ₹1.35 కోట్లు
డే 7: ₹1.25 కోట్లు
మొత్తం వారం నెట్ కలెక్షన్లు: ₹30.14 కోట్లు.
ఇప్పటికే ఓవరాల్ కలెక్షన్లు తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో, ట్రేడ్ నిపుణులు ‘కన్నప్ప’కు భారీ నష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు. హిందీ వెర్షన్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలు, గ్లామరస్ క్యాస్ట్ ఉన్నా కూడా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయినట్టు ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రేటు కొనసాగితే, ‘కన్నప్ప’కు లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా మిగిలే అవకాశం కనిపిస్తోంది.






