
మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప(Kannappa)’ విడుదలకు రంగం సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. కన్నప్పకు UA సర్టిఫికెట్ దక్కించుకుంది. పరమ శివభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ అనంతరం సినిమా రన్ టైమ్(Run Time) 3 గంటల 2 నిమిషాలు (182 నిమిషాలు)గా ఖరారైంది. కాగా తొలుత సినిమాను మొదట 195 నిమిషాల నిడివితో రూపొందించారు.
Manchu Vishnu’s #Kannappa completes censor formalities.
The film’s runtime changed from 195 to 182 minutes 👇 pic.twitter.com/EjqPw7AsEo
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) June 24, 2025
మొత్తం 13 కట్స్.. పలు సన్నివేశాలు డిలీట్
అయితే, సెన్సార్ బోర్డు(censor board) సభ్యులు కొన్ని మార్పులు సూచించడంతో, చిత్ర బృందం మొత్తం 13 కట్స్‌కు అంగీకరించింది. తొలగించిన సన్నివేశాల్లో ఒక చిన్నారిని రాబందు పైనుంచి కిందకు పడేసే దృశ్యం, తిన్నడుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, అలాగే మూడు పాటల్లోని కొన్ని విజువల్స్ ఉన్నాయని సమాచారం. ఈ మార్పుల అనంతరం సినిమా రన్‌టైమ్‌ను ఖరారు చేశారు. ‘కన్నప్ప’ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్(Advance bookings) ఇవాళ్టి (జూన్ 25) నుంచి ప్రారంభమవుతాయని మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
#Kannappa: Vishnu Manchu-starrer undergoes 13 cuts, receives censor certificatehttps://t.co/zBZ6xnTF4p
— News9 (@News9Tweets) June 24, 2025
సినిమాలో భారీ తారాగణం
కాగా మంచు విష్ణు(Manch Vishnu) నటిస్తున్న హిస్టారికల్ చిత్రం కన్నప్ప(Kannappa). డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్(Mohan lal), మోహన్ బాబు(Mohan Babu), ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, నయనతార(Nayanatara), అసితా అనోలా రోడ్రిగ్స్ తదితర స్టార్ నటీనటులు నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్(Avram Manchu) సినీఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.