Shobha Shetty: కార్తీకదీపం మోనిత పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిందిగా.. ఎప్పుడంటే?

బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్(Biggtv Kissisk Taik Show) కార్యక్రమానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ వారం ఈ షోలో కార్తీకదీపం ఫేమ్ శోభా శెట్టి(Shobha Shetty) అతిథిగా హాజరయ్యారు. చాలామందికి ఆమె పేరు కన్నా కార్తీకదీపం(Karthika Deepam’) సీరియల్‌లో విలన్ “మోనిత(Monitha)” పాత్ర ద్వారానే గుర్తుంటుంది. ఈ పాత్రతో తెలుగువారికి ఎంతో చేరువైన శోభా, ఈ సీరియల్ తర్వాత ఇంకెక్కడా నటించలేదు. ప్రస్తుతం మాత్రం బుల్లితెర కార్యక్రమాల్లో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.

తాజాగా విడుదలైన ప్రోమోలో శోభా తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి విశేషాలు పంచుకున్నారు. కన్నడ బిగ్ బాస్, తమిళ-తెలుగు సీరియల్స్, సినిమాల్లో తన ప్రయాణాన్ని గుర్తు చేసింది. ముఖ్యంగా, తన ప్రేమికుడు, నటుడు యశ్వంత్ రెడ్డి(Yasvanth Reddy)తో నడిచిన ప్రేమ గురించి మాట్లాడుతూ, త్వరలోనే తన పెళ్లి(marriage) జరగబోతోందని వెల్లడించింది.

కార్తీకదీపం సీరియల్‌ సమయంలోనే శోభా-యశ్వంత్ మధ్య ప్రేమ చిగురించిందని, అయితే బిగ్ బాస్ షో ద్వారా ఆ విషయం బహిర్గతమైందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ కలసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. గత ఏడాది వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా శోభా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో తన తల్లితో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో నిద్రించాల్సి వచ్చిందని భావోద్వేగంగా తెలిపారు. యశ్వంత్ తన ప్రపోజల్‌ను వెంటనే అంగీకరించలేదని, కానీ ఇప్పుడు తను లేకపోతే జీవితమే లేదని చెప్పడం వైరల్ అయింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *