
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) బుధవారం కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పలువురిని విచారించిన కమిషన్ తాజాగా కేసీఆర్‌ను విచారిస్తోంది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ఆయన్ను విచారిస్తున్నట్లు సమాచారం. బీఆర్కే భవన్‌లోకి వెళ్లేందుకు కేసీఆర్‌తో పాటు 9 మంది నేతలకు అనుమతి ఇచ్చారు.
కేసీఆర్‌కు స్వల్ప అనారోగ్యం
ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంగా ఉన్నారు. ఆయన కొంత జలుబు బాధపడుతున్నారు. ఈక్రమంలో విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను (Justice PC Ghose Commission) కేసీఆర్ కోరారు. ఆయన విజ్ఞప్తిని జస్టిస్ పీసీ ఘోష్ పరిగణనలోకి తీసుకున్నారు. మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.
ప్రశ్నిస్తూ.. అఫిడవిట్లు స్వీకరిస్తున్న కమిషన్
మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారిస్తోంది. వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్‌ను సైతం పూర్తిచేసింది. తాజాగా కేసీఆర్‌ను ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై ఇప్పటివరకు 114 మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. కొంతకాలంగా అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన కమిషన్.. ఇటీవలే మాజీ మంత్రులు ఈటల రాజేందర్ (Eatala Rajendar), హరీశ్‌రావు (Harish Rao)ను కూడా ప్రశ్నించింది.
BRS chief and former CM #KCR is set to appear before the PC Ghose Commission in connection with the alleged irregularities in the #KaleshwaramProject.#KaleshwaramProbe #TelanganaPolitics #KCR #BRSPresident #PCGhoseCommission pic.twitter.com/Sa1XhyELFv
— Glint Insights Media (@GlintInsights) June 11, 2025