కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) విచారణల అంశం తుదిదశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై చివరగా BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Ex Cm KCR)ను ఇవాళ (జూన్ 11) కమిషన్ విచారించనుంది. ఇప్పటికే కేసీఆర్‌కు విచారణకు ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలందాయి. తొలుత ఈనెల 5వ తేదీనే విచారణకు రావాలని కమిషన్ ఆదేశించగా.. అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని దానికి బదులు 11వ తేదీన విచారణకు హాజరు అవుతానంటూ కేసీఆర్ లేఖ రాశారు. దీంతో ఆయన విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ అంగీకరించిన విషయం తెలిసిందే.
కేసీఆర్ విచారణతో అసలు విషయం తేలనుందా?
కాగా ఇవాళ ఉదయం 8 గంటలకు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్(Erravalli Farm House) నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఉ.11.30 గంటలకు హైదరాబాద్ BRK భవన్‌లో కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్(Commission Chairman PC Ghosh) ఎదుట విచారణకు హాజరవుతారు. కాగా ఇప్పటివరకు 17 మంది కీలక వ్యక్తులను విచారించిన కమిషన్ చివరగా KCRను విచారించనుంది. రాజకీయ ప్రముఖులుగా అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, హరీశ్ రావు(Harish Rao)ను ఆర్థిక, టెక్నికల్ అంశాలపై విచారించింది. కాగా కేసీఆర్ విచారణతో అసలు విషయం బయటపడుతుందా? అసలు కేసీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారనేది ఉత్కంఠగా మారింది.
హరీశ్ రావుతో కేసీఆర్ సుదీర్ఘ చర్చలు
కాగా కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే హరీశ్ రావుతో కేసీఆర్ రెండ్రోజులుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ మేరకు కాళేశ్వరం కమిషన్‌కి ఇచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ ఓ నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PowerPoint Presentation) కూడా ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ మొత్తంగా 200మందికి పైగా విచారించి ఇప్పటికే 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ప్రాజెక్టు డిజైన్‌లు, అనుమతులు, నిధులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసింది.
Sincerely happy and also praying for PC Ghose Commission—KCR coming to you to inform about Kaleshwaram will be the landmark in your career 💐
You are in for a treat -congrats 😃 pic.twitter.com/nmPU8hhy2K
— NPR (@naineni9999) June 10, 2025






