
Mana Enadu : ‘మహానటి’ సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్ (Keerthy Suresh). ఈ భామ ప్రస్తుతం తెలుగు, తమిళం ఇండస్ట్రీల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ‘బేబీ జాన్’ చిత్రంతో ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. వరుణ్ ధావన్ (Varun Dhawan)తో జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘నైన్ మటక్’ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బిగ్ బాస్ సెట్ లో కీర్తి
ఇక ‘బేబీ జాన్ (Baby John)’ చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. ఇందులో భాగంగా ఈ టీమ్ హిందీ బిగ్ బాస్ 18 షోకు వెళ్లింది. ఈ క్రమంలో హోస్టు సల్మాన్ ఖాన్ (Salman Khan) తో కలిసి కీర్తి సురేష్ సరదాగా ముచ్చటించింది. తన కో స్టార్ వామికా గబ్బితో కలిసి సందడి చేసింది. బేబీ జాన్ సినిమాలోని ‘నైన్ మటక్’ పాటకు కీర్తి సురేష్-సల్మాన్ ఖాన్ తో కలిసి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
బేబీ జాన్ లో సల్మాన్ కేమియో
ఈ మూవీలో సల్మాన్ ఖాన్ కేమియో చేశారు. క్లైమాక్స్ ఫైట్ లో ఆరు నిమిషాల పాటు సల్మాన్ ఖాన్ కనిపించనున్నారట. ఇక బేబీ జాన్ సినిమా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తేరి (Theri)’కి రీమేక్ అన్న విషయం తెలిసిందే. తమిళంలో ఈ సినిమాలో విజయ్ దళపతి (Vijay Dalapathi), సమంత, అమీ జాక్సన్ కలిసి నటించారు. తెలుగులో పోలీసోడు పేరుతో ఈ చిత్రాన్ని డబ్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీని తమిళ డైరెక్టర్ అట్లీ తన భార్య ప్రియ అట్లీతో కలిసి నిర్మించారు.
Aik Mahina Lagha Na Varun ko #NainMatakka Sikhne Main.#SalmanKhan to #KeerthySuresh 🤣@BeingSalmanKhan #SalmanKhan pic.twitter.com/KaEebrOkwf
— Filmy_Duniya (@FMovie82325) December 22, 2024