మహానటి(Mahanati) సినిమాతో ఒక్కసారిగా సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న నటి కీర్తి సురేష్(Keerthy Suresh). ఆ తర్వాత దసరా సినిమాతో నటనలో మరో మెట్టు ఎక్కేసింది. దసరా(Dasara) సినిమాలో కీర్తి చేసిన పెళ్లి డ్యాన్స్ ఇప్పటికీ అభిమానుల కళ్లలో మెదులుతూనే ఉంది. ఇటు తెలుగు ఇండస్ట్రీ(Tollywood)తోపాటు ఒక్కటే కాకుండా హిందీ ఇటు తమిళ ఇండస్ట్రీలోనూ ఆమె సినిమాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే… తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కీలక ప్రకటన చేశారు. 28 రోజుల్లోనే షూటింగ్ పూర్తయిందని ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది కీర్తి.
జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో..
హీరోయిన్‌గా కీర్తి సురేష్, హీరో సుహాస్(Suhaas) ప్రధాన పాత్రలో రూపొందిన కొత్త చిత్రం ‘ఉప్పు కప్పురంబు(Uppu Kappurambu)’. ఈ సినిమా షూటింగ్ 28 రోజుల్లోనే.. ఫినిష్ చేసినట్లు తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ వెల్లడించింది. ఈ సినిమా ప్రమోషన్స్(Promotions)లో భాగంగానే ఆమె ఫుల్ బిజీ అయ్యారు. ఈ సినిమా జులై 4వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
Chaos and comedy erupt in Chittijayapuram, bringing new concerns 👑#UppuKappurambuOnPrime, New Movie, July 4@ActorSuhas @AniSasiOnO @RadhikaLavu @EllanarFilms_ @VasanthMaringa1 #DivakarMani @SweekarAgasthi @RajeshMRadio @sreejithsarang pic.twitter.com/Rqn0pFE7jP
— Keerthy Suresh (@KeerthyOfficial) June 19, 2025






