
Mana Enadu : దేశ రాజధాని దిల్లీ (Delhi)లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హస్తినలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. మరోసారి రాజధానిలో గద్దెనెక్కాలని అధికార ఆప్ పార్టీ ఉవ్విళ్లూరుతుంటే.. ఈసారైనా అక్కడ జెండా పాతాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. రోజురోజుకు దిల్లీలో రాజకీయం రాజుకుంటున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే దిల్లీ సీఎం అరెస్టు
దిల్లీ సీఎం అతిశీ (Atishi)ని త్వరలోనే అరెస్టు చేస్తారని కేజ్రీవాల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. ఆప్ తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటి పథకాలు కొందరికి నచ్చలేదని.. అందుకే ఓ తప్పుడు కేసులో త్వరలో ముఖ్యమంత్రి అతిశీని ఆరెస్టు చేస్తారని ఆయన జోస్యం చెప్పారు. అంతకంటే ముందు ఆప్ సీనియర్ నాయకుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
महिला सम्मान योजना और संजीवनी योजना से ये लोग बुरी तरह से बौखला गए हैं।
अगले कुछ दिनों में फ़र्ज़ी केस बनाकर आतिशी जी को गिरफ्तार करने का इन्होंने प्लान बनाया है
उसके पहले “आप” के सीनियर नेताओं पर रेड की जायेंगी
आज 12 बजे इस पर प्रेस कांफ्रेंस करूँगा।
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2024
మహిళలకు ప్రతినెల రూ.2,100
మరోవైపు ఎన్నికల నేపథ్యంలో.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ‘మహిళా సమ్మాన్ యోజన’ కింద మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఆర్థికసాయం చేస్తామని ఆప్ (AAP) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ‘సంజీవని యోజన’ స్కీమ్ కింద దిల్లీలోని సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీలిచ్చి.. ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం కూడా షురూ చేసింది.
మాకు నోటిఫై చేయలేదు
మరోవైపు ఈ పథకాలకు సంబంధించి దిల్లీ వాసులను అప్రమత్తం చేస్తూ ఇటీవల ఓ వార్తా పత్రికలో ప్రకటన వెలువడింది. ‘మహిళా సమ్మాన్ యోజన కింద దిల్లీలోని మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని ఓ రాజకీయ పార్టీ చెబుతోందని మీడియా కథనాల ద్వారా మా దృష్టికి వచ్చింది. దిల్లీ ప్రభుత్వం అలాంటి స్కీమ్‌ను మాకు నోటిఫై చేయలేదు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో సంజీవని పథకం లేదు.’ అని మహిళా, శిశు అభివృద్ధి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలు పేర్కొనడంతో తాజాగా కేజ్రీవాల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.