Wedding Card: వారెవ్వా.. పెళ్లి కార్డు అదిరిపోయిందిగా..!

పెళ్లి(Marriage).. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఓ మెమోరబుల్ మూమెంట్(A memorable moment). మూడు ముళ్లు, ఏడు అడుగులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి జంటా కోరుకుంటుంది. అందుకు తగ్గట్లే ఈరోజుల్లో వెడ్డింగ్ సెలబ్రేషన్స్(Wedding Celebrations) జరుపుకుంటోంది యూత్. నాటి కాలంలో పెళ్లి వేడుకలు దాదాపు 20 రోజుల వరకూ జరిగేవి. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రీ వెడ్డింగ్ షూట్(Pre wedding shoot), డెస్టినేషన్ వెడ్డింగ్, హల్దీ, బ్యాచులర్ పార్టీ, రిసెప్షన్స్ ఇలా ఒక్కటేమిటీ అన్నీ డిఫరెంటుగానే జరుపుకుంటున్నారు. అందుకు తగ్గట్లు వెడ్డింగ్ కార్డ్స్(Wedding cards), ఫంక్షన్ హాల్స్, డెకరేషన్ వంటివి గ్రాండ్‌గా ఉండాలని భావిస్తున్నారు.

బంధువులు, స్నేహితులు ఫిదా

పైగా జీవితంలో ఒక్కసారే వచ్చే వివాహ తంతు కోసం పెళ్లి ఖర్చు విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. అది అబ్బాయి తరఫు వారైనా.. అమ్మాయి తరఫు వారైనా.. పది కాలాల పాటు అందరూ చెప్పుకునేలా తమ పెళ్లి ఉండాలని వధూవరులు, వారి పేరెంట్స్ కోరుకుంటోంది. తాజాగా ఓ జంట తమ పెళ్లి కార్డును వినూత్నంగా ప్రచురించి అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల వింతవింత పెళ్లి కార్డులు చూశాం. అందులో ఆధార్, యాపిల్ మ్యాక్ బుక్ వంటి డిజైన్లలో ఇన్విటేషన్ కార్డ్స్(Invitation cards) వచ్చాయి. ఇంతకీ ఈ విషయం ఎక్కడంటే.. కేరళకు చెందిన ఓ జంట రేషన్ కార్డు తరహాలో పెళ్లికార్డు(marriage card similar to a ration card) ప్రింట్ చేయించింది. ఈ కార్డును చూసి వారి బంధువులు, స్నేహితులు ఫిదా అయిపోతున్నారట.

wedding invitation

రేషన్ షాపుతో తనకున్న అనుబంధంతోనే..

కేరళ(Kerala)లోని పతనం తిట్టకు చెందిన జ్యోతిష్ ఆర్ పిళ్లై అనే వరుడు, వధువు దేవికతో పెళ్లి నిశ్చయమైంది. వరుడు స్థానిక రేషన్ షాపులో పనిచేస్తుండటం, దానితో తనకు, తన కుటుంబానికి ఉన్న సంబంధాన్ని గుర్తుగా తన పెళ్లి కార్డును రేషన్ కార్డు మాదిరి ప్రింట్ చేయించాడు. కాగా వీరి పెళ్లి ఈనెల 2వ తేదీన జరగగా.. వీరి పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియా(SM)లో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఒక్క పెళ్లికార్డుతో ఈ జంట ఫేమస్ అయిపోయింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *