2023లో వచ్చిన ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ వెబ్ సిరీస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలో సంచలనం సృష్టించిన ఈ వెబ్ సిరీస్‌కి తాజాగా సీజన్ 2 ను రూపొందించారు. అజు వర్గీస్, లాల్, జిన్జ్ షాన్, నివాస్ వాలిక్కున్ను, శ్రీజిత్ మహదేవన్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ డ్రామా వెబ్‌సిరీస్‌కి కొనసాగింపుగా ‘కేరళ క్రైమ్ ఫైల్స్2’ (kerala crime files season 2) సిద్ధమైంది.
తాజాగా ఇందుకు సంబంధించి తెలుగు ట్రైలర్‌ను ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ పంచుకుంది. సరికొత్త క్రైమ్ కథాంశంతో ఈ సిరీస్‌ను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూ లాస్తే అర్థమవుతోంది. అతి త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
https://youtu.be/OEivfMnzvfA?si=ccIFMv8P7e6cd4PA






