ఎన్నో అంచనాల మధ్య కొత్త సంవత్సరం(New Year)లోకి అడుగుపెట్టాం. డిసెంబర్ 31న రాత్రంతా గత ఏడాది మంచి-చెడులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా పార్టీ(Party) చేస్తున్నాం. అయితే ఈ బిజీబిజీ లైఫ్‌లో రోజులు, క్యాలెండర్లు మాత్రమే మారుతాయని, పేదల బతుకులు మాత్రం మారడం లేదంటూ పలువురు వాపోతున్నారు. ప్రభుత్వాలు సైతం ఓవైపు ఉచితాలు(Free Schemes) ప్రకటిస్తూనే మరోవైపు తమ జేబులకు చిల్లులు పెడుతున్నాయని అంటున్నారు. అందులో భాగంగా ఈరోజు (Jan 1, 2025) నుంచి కొన్ని రూల్స్(New Rules) అమల్లోకి వచ్చాయి. ఇంతకీ అవేంటో మనమూ తెలుసుకుందాం పదండి..
ఏటీఎంతో పెన్షన్ సొమ్ము విత్ డ్రా చేసుకోవచ్చు
సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్స్ సిస్టమ్ (CPPS)లో భాగంగా పెన్షన్ ఉపసంహరణను EPFO క్రమబద్ధీకరించిది. దీంతో, పెన్షన్(Pension) ఉపసంహరణ మరింత సులభంగా మారింది. పెన్షనర్లు ఇకపై దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ను ఉపసంహరించుకోవచ్చు. మరోవైపు EPFO త్వరలోనే ATM కార్డులను జారీ చేయనుంది. దీంతో చందాదారులు 24 గంటలపాటు డబ్బును విత్‌డ్రా(Withdraw) చేసుకునే అవకాశం దక్కుతుంది. పన్ను చెల్లింపుదారులు మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను పాటించడం తప్పనిసరి. ‘UPI 123Pay’ ద్వారా ఫీచర్ ఫోన్లలో పేమెంట్లు చేస్తున్నవారు ఇవాళ్టి నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10 వేల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు.
రైతులకు రూ.2లక్షల రుణం
వీటితోపాటు దేశంలోని రైతులు ఇకపై రూ.2 లక్షల వరకు హామీలేని బ్యాంక్ రుణాన్ని(Bank Loan) పొందవచ్చు. ఈ మేరకు మునుపటి రూ.1.60 లక్షల పరిమితిని RBI పెంచింది. ఇక అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లోని కంటెంట్‌ను TVల్లో కేవలం రెండింటిలో మాత్రమే ఒకేసారి చూడవచ్చు. మూడో టీవీలో చూడటం కుదరదు. ఇక కార్లు, ఇళ్లు కొనాలనే వారికీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. అన్ని రకాల కార్లపై 3-5శాతం ధరలు పెరగనున్నాయి. ఇక భారతదేశంలోని నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు తమ VISA అపాయింట్మెంట్ను ఫ్రీగా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. వీటితో మరికొన్ని కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి.






