చింతకాని రైల్వేస్టేషన్‌లో ఓవ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా యాచకుడిగా గుర్తించారు.మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు లభించలేదని జీఆర్‌పీ ఎస్సై పారుపల్లి భాస్కర్‌రావు తెలిపారు.గడిచిన నెలరోజులుగా రైల్వేస్టేషన్‌లోనే ఉంటూ బిక్షాటన చేస్తున్నట్లుగా ప్రాథమికంగా నిర్థారించారు. ఖమ్మం నగరానికి చెందిన అన్నం ఫౌండేషన్ బృందం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవపరీక్ష అనంతరం దహన సంస్కరణ చేయనున్నట్లు పేర్కొన్నారు.









