జూలై(July) 2025లో మారుతి సుజుకి ఎర్టిగా(Maruti Suzuki Ertiga) 16,604 యూనిట్ల విక్రయాలతో మరోసారి దేశంలో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ MPVగా రికార్డ్ సాధించింది. తక్కువ ధర(Low Price), విశాలమైన ఇంటీరియర్, అధిక మైలేజ్(High Mileage), బ్రాండ్ నమ్మకం.. ఈ అంశాలు ఎర్టిగాను ఫ్యామిలీ కారుగా ప్రత్యేకంగా నిలిపాయి.
ధరలు
ఎక్స్-షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 8.97 లక్షల నుండి రూ. 13.41 లక్షల వరకు ఉంది. బేస్ వేరియంట్ LXi (O) ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 9.90 లక్షలు. CNG వేరియంట్ రూ. 10.74 లక్షల నుండి రూ. 12.25 లక్షల వరకు లభిస్తుంది.

ఫీచర్లు
ఎర్టిగా లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, ఆలెక్సా సపోర్ట్ కూడా ఉన్నాయి.
భద్రత
ప్రతి వేరియంట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా లభిస్తాయి. అలాగే ABS with EBD, బ్రేక్ అసిస్ట్, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు అందించబడ్డాయి.

ఇంజిన్ & పనితీరు
పెట్రోల్: 1.5L స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ – 101.65 bhp పవర్, 136.8 Nm టార్క్, CNG: 88 PS పవర్, 121.5 Nm టార్క్. ట్రాన్స్‌మిషన్: పెట్రోల్ – 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్, CNG – 5-స్పీడ్ మాన్యువల్
మైలేజ్
MPV సెగ్మెంట్‌లో ఎర్టిగా మైలేజ్ ఛాంపియన్‌గా గుర్తింపు పొందింది. 45 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 60 లీటర్ల CNG ట్యాంక్ కలయికతో VXi (O) వేరియంట్ ఒక్కసారి నింపితే 1000-1100 కి.మీ ప్రయాణం చేయవచ్చు.






