
విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌డమ్’ (Kingdom)ఈ రోజు (జూలై 31) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ డ్రామాలు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి( Gowtham Tinnanuri) ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తన స్టైల్‌కి భిన్నంగా, మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ పవర్‌పుల్ యాక్షన్ మూవీని రూపొందించారు.
ఈ చిత్రంలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్సే(Bhagyashri Borse) హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
‘కింగ్‌డమ్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. ఈ క్రమంలో సినిమాలో నటించిన తారలు, టెక్నీషియన్ల పారితోషికాల( Remuneration ) వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎవరెవరు ఎంత పారితోషికం తీసుకున్నారనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే కింగ్ డమ్ సినిమా కోసం విజయ్ దేవరకొండ సుమారు రూ. 30 కోట్ల రెమ్యునరేషన్( Remuneration ) తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికితోడు లాభాల్లో షేర్ కూడా పొందనున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి – రూ. 7 కోట్లు, సత్యదేవ్ – రూ. 3 కోట్లు, అనిరుధ్ – రూ. 10 కోట్లు, భాగ్య శ్రీ బోర్సే – రూ. 1 కోటి, ఇతర నటీనటులు – రూ. 2 కోట్లు, టెక్నీషియన్లు – రూ. 7.5 కోట్లు వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంటే పారితోషికాల మొత్తమే దాదాపు రూ. 60 కోట్లు కాగా, సినిమా మొత్తం బడ్జెట్ రూ. 130 కోట్ల వరకు ఉన్నట్టు సమాచారం. అయితే, ఇందులో ఎంత నిజముందో తెలియాల్సిఉంది. ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజయ్ దేవరకొండ నటన బాగుందంటూ ఫ్యాన్స్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.