
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన ‘కింగ్డమ్’ (Kingdom) మూవీ జులై 31న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. మూడో రోజు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లను చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. (Kingdom Collections) మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.67 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక నాలుగో రోజైన ఆదివారం సెలవు కావడంతో భారీగా బుకింగ్స్ జరిగాయి. నాలుగో రోజు రూ.10 నుంచి రూ.15 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి..
‘కింగ్డమ్’ సినిమా ఫస్ట్ డే రూ.39 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు రూ.14 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడో రోజు శనివారం కూడా రూ. 14 కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఇక నాలుగో రోజు రూ.10 నుంచి రూ.15 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అంటే మొత్తంగా దాదాపు రూ.80 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. రానున్న వారం రాఖీ పండుగ సెలవు ఉండటంతో సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. త్వరలోనే కింగ్డమ్ మూవీ రూ.100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని మూవీ టీమ్ ధీమాగా ఉంది.