టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇటీవలే ‘క’ అనే చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆ తర్వాత వరుసగా పలు కొత్త ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. ఇందులో భాగంగానే విశ్వకరుణ్ దర్శకత్వంలో ‘దిల్రూబా (Dil Ruba)’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా సందడి చేస్తోంది. మనసుని హత్తుకునే లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమా మార్చి 14వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇవాళ (గురువారం) ట్రైలర్ రిలీజ్ చేశారు.
నా దృష్టిలో వాటికి విలువ లేదు
ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం లవర్ బాయ్ గానే కాకుండా యాంగ్రీ యంగ్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. తన లవర్ కోసం ఎంతటివారినైనా ఎదిరించే యువకుడిగా కనిపించాడు. ఇక ట్రైలర్ (Dil Ruba Trailer) అంతా ఇందులో నటించిన వారి పాత్రలను పరిచయం చేస్తూ సాగింది. ‘తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయిన తర్వాత చెప్పే థాంక్స్‌కి నా దృష్టిలో విలువ లేదు’ అని కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్ ట్రైలర్ కు హైలైట్ గా నిలిచింది. లవర్ పాత్రలో కిరణ్ అబ్బవరం యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు అలరించేలా ఉన్నాయి. మరి మీరు ఈ ట్రైలర్ చూడండి..






