ఈ సీజన్ IPLలో వరుణుడు మరో ఛాంపియన్ టీమ్(KKR)ను ఇంటిదారి పట్టించాడు. తొలుత హైదరాబాద్ వేదికగా ఢిల్లీ(DC)తో మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను వానదేవుడు నాకౌట్ చేయగా.. తాజాగా RCB వర్సెస్ KKR మ్యాచు ప్రారంభం కాకుండానే రద్దైంది. భారీ వర్షం(Heavy Rain) కారణంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచు టాస్ కూడా పడకుండానే అంపైర్లు తప్పక రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే 13 మ్యాచుల్లో 12 పాయింట్లతో కేకేఆర్ ప్లేఆఫ్స్ రేస్(Playoffs Race) నుంచి నిష్క్రమించింది. అటు 17 పాయింట్లతో RCB పాయింట్స్ టేబుల్(Points Table)లో టాప్‌లోకి దూసుకెళ్లింది. మరో 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న బెంగళూరుకు ప్లేఆఫ్స్‌కు చేరడం కన్ఫామ్.
49 pigeons soaring over #chinnaswamystadium 🐦
As if nature itself paused to pay tribute to the one and only Virat Kohli.
The King in whites, the legend lives on.
Virat Kohli’s Test numbers ,,,,Like ❤️ if you want to stop Rain ,,,☔#RCBvsKKR #KKRvsRCB#RCBvsKKR pic.twitter.com/eDZaFhU5RE
— pk kotwal (@pkkotwal278775) May 17, 2025
ఐపీఎల్‌లో ఇవాళ డబుల్ హెడర్
ఇక ఐపీఎల్‌లో ఇవాళ అభిమానులకు డబుల్ డోస్ ఎంటర్‌టైన్మెంట్ దక్కనుంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్(RRvsPBKS) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచు మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభ కానుంది. ఈ మ్యాచ్ పంజాబ్‌కు అత్యంత కీలకం. మరోవైపు రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ వేదికగా జరిగే మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్(GT vs DC) అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచులో గుజరాత్ గెలిస్తే టాప్ ప్లేస్‌కు.. ఢిల్లీ గెలిస్తే మూడో ప్లేస్‌కు చేరే ఛాన్సుంది. కాగా ఇప్పటికే టోర్నీ నుంచి RR, SRH, CSK నిష్క్రమించిన విషయం తెలిసిందే.






